చంద్రబాబుపై అంబటి రాంబాబు విమర్శలు

ఎన్టీఆర్ జిల్లాని ప్రకటిస్తే ధన్యవాదాలు కూడా చెప్పరు: అంబటి రాంబాబు

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుపై వైస్సార్సీపీ ​ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు కురిపించారు. దివంగత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తారని… కానీ, ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ప్రకటిస్తే ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా చెప్పలేదని అన్నారు.

విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు, బాలకృష్ణ, పురందేశ్వరి తదితరులు స్వాగతించారు. ఎన్టీఆర్ అందిరి మనిషి అని జిల్లాకు ఆయన పేరు పెట్టడం సంతోషకరమని చంద్రబాబు చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/