ఎయిర్‌టెల్‌, ఐడియాకు అంబానీ సలహాలు

jio
jio

ముంబయి: టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి భారీగా బకాయిపడ్డ మొత్తాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ముకేశ్‌ అంబానీకి చెందిన జియో కేంద్రానికి ఓ లేఖ రాసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యర్థి కంపెనీలకు ఎలాంటి ఆర్థిక ఉపశమనం కల్పించొద్దని కోరింది. బకాయిలు చెల్లించడానికి భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌కు అన్ని రకాల ఆదాయ వనరులు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు సదురు కంపెనీలకు ఉన్న ఆదాయమార్గాలను పేర్కొంటు కొన్ని సూచనలు కూడా చేసింది. సంస్థకు చెందిన పలు ఆస్తులు వాటాలను విక్రయించడం ద్వారా ఎయిర్‌టెల్‌కు 5.7 బిలియన్‌ డాలర్లు సమకూరే అవకాశం ఆందని తెలిపింది. అదేవిందంగా వొడాఫోన్‌ ఐడియాకి కూడా ఇలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఈ రెండు కంపెనీలు ఇండస్‌ టవర్స్‌లో ఉన్న తమ వాటాల్ని విక్రయించవచ్చని సలహా ఇచ్చింది. ఈ సందర్భంగా జియో రెగ్యులేటరీ అపైర్స్‌ ఆధ్యక్షుడు కపూర్‌ సంగ్‌ నవంబర్‌ 1న కేంద్రానికి లేఖ రాశారు. దాన్ని ఆదివారం బయటపెట్టారు. టెలికాం సర్వీసు ప్రొవైడర్ల నుంచి సమారు రూ..92వేల కోట్ల మేర సవరించిన స్థూల ఆదాయం (ఎజిఆర్‌) వసూలు చేసెందుకు కేంద్రానికి సుప్రీం కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో అత్యధికంగా ఎయిర్‌టెల్‌ రూ.21,682.13కోట్లు వొడాఫోన్‌ రూ.. 19.823కోట్టు చెల్లించాల్సి ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/