వరల్డ్‌ రిచెస్ట్‌ స్పోర్ట్స్‌ టీమ్‌ యజమానుల జాబితాలో అంబానీకి అగ్రస్థానం

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరో అరుదైన ఘనత సాధించారు. ఇటీవలే ఫోర్బ్స్‌ ప్రకటించిన జాబితాలో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన ముఖేశ్‌ అంబానీ…తాజాగా 2019లో ప్రపంచంలో రిచెస్ట్‌ స్పోర్ట్స్‌ టీమ్‌ ఓనర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ముకేశ్‌ అంబానీ 50 బిలియన్‌ డారల్లతో అగ్రస్థానంలో చోటు దక్కించుకున్నారు. 2008 ఐపిఎల్‌ ఆరంభ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుని రిలయన్స్‌ అనుబంధ సంస్థగా 100మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో అమెరికాకు చెందిన స్టీవ్‌ బాల్మర (41.2బిలియన్‌ డాలర్లు)తో రెండో స్థానంలో నిలిచార. స్టీవ్‌ బాల్మర్‌ ఎన్‌బిఏ లీగ్‌లో లాస్‌ ఏంజెల్స్‌ క్లిప్పర్స్‌ జట్టుకి ఓనర్‌గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ నుంచి రిటైరైన ఏడాదే 2 బిలియన్‌ డాలర్లకు లాస్‌ ఏంజెల్స్‌ క్లిప్పర్స్‌ జట్టుని కొనుగోలు చేశారు. అంతేకాదు 2000 నుంచి 2014 వరకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ సిఈఓగా సేవలందించారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంబిఏ ఫ్రోగ్రామ్‌ను మధ్యలోనే వదిలేసిన స్టీవ్‌ బాల్మర్‌ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా చేరి సిఈఓ స్థాయికి ఎదిగారు.
ముకేశ్‌ అంబాని (ఇండియా) : నికర విలువ – 50 బిలియన్‌ డాలర్లు (ఐపిఎల్‌ -ముంబై ఇండియన్స్‌ జట్టు)
స్టీవ్‌ బాల్మర్‌ (అమెరికా) : నికర విలువ – 41.2 బిలియన్‌ డాలర్లు (ఎన్‌బిఏ -లాస్‌ ఏంజెల్స్‌ క్లిప్పర్స్‌)
డెట్రిచ్‌ మేట్స్‌చిట్జ్‌ (ఆస్ట్రేలియా) : నికర విలువ – 18.9బిలియన్‌ డాలర్లు (రెడ్‌బుల్‌ ఎనర్జీ డ్రింక్‌)
హస్సో ప్లాట్నర్‌ మరియు ఫ్యామిలీ (జర్మనీ) : నికర విలువ – 13.5 బిలియన్‌ డాలర్లు (అమెరికన్‌ ఐసి హాకీ జట్టు – శాన్‌ జోష్‌ షార్క్స్‌)
రోమన్‌ అబ్రామోవిచ్‌ (రష్యా) : నికర విలువ – 12.4 బిలియన్‌ డాలర్లు (ఇంగ్లీష్‌ ప్రీమియర్‌ లీగ్‌ -చెల్సియా)
డేవిడ్‌ టెప్పర్‌ (అమెరికా) : నికర విలువ – 11.6 బిలియన్‌ డాలర్లు (అమెరికా ఫుట్‌బాల్‌ టీమ్‌-కరోలినా పాంథర్స్‌)
ఫిలిఫ్‌ ఆన్షుచుట్‌ (అమెరికా) : నికర విలువ – 10.9బిలియన్‌ డాలర్లు (ఎన్‌హెచ్‌ఎల్‌-లాస్‌ ఏంజెల్స్‌ కింగ్స్‌)
మైకయిల్‌ ప్రోకోర్వ్‌ (రష్యా) : నికర విలువ – 9.8బిలియన్‌ డాలర్లు (ఎన్‌బిఏ లీగ్‌ -బ్రూక్లెన్‌ హైట్స్‌)
మైకీ ఆరిసన్‌ (ఇజ్రాయిల్‌ -అమెరికా) : నికర విలువ – 8.9బిలియన్‌ డాలర్లు (ఎన్‌బిఏ లీగ్‌ -మియామి హీట్‌)
స్టాన్లీ క్రోయాంకా (అమెరికా) : నికర విలువ – 8.7బిలియన్‌ డాలర్లు ( ఎన్‌ఎఫ్‌ఎల్‌ లీగ్‌ – లాస్‌ ఏంజెల్స్‌ రామ్స్‌)

https://www.vaartha.com/news/sportsమరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.