ఈశా అంబానీ పెళ్లి వేడుకకు డిసెంబర్ 12న

ambani marriage festival
Ambani marriage festival

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుడు ముఖేశ్ అంబానీ గారాలపట్టి ఈశా అంబానీ పెళ్లి వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌‌లో ప్రారంభమైన వేడుకలకు అతిరథ మహారథులు తరలివస్తున్నారు. ఈ వివాహ వేడుకకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్‌తో పాటు విఖ్యాత క్రికెటర్ సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కొత్త జంట ప్రియాంక చోప్రా నిక్ జోనస్, కత్రినా కైఫ్, విద్యాబాలన్, ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్‌ తదితరులు హాజరైన సంగతి తెలిసిందే.