ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ త్వరలోనే..
ఈ ఆన్లైన్ కొనుగోళ్ల పండగ భారత దేశంలో జనవరి 19 నుంచి 22 వరకు ఉంటుంది

బెంగళూరు: ఇ-కామర్స్ దిగ్గజం ఆమెజాన్ 2020లో మొదటి గ్రేట్ ఇండియన్ సేల్ తేదీలను ప్రకటించింది. ఈ ఆన్లైన్ కొనుగోళ్ల పండగ భారత దేశంలో జనవరి 19 నుంచి 22 వరకు ఉంటుంది. కాగా ప్రైమ్ వినియోగదారులకు మాత్రం 12 గంటలు ముందుగా అంటే జనవరి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుంది. అంతే కాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఈ సేల్లో ప్రతి కొనుగోలుపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానికిక్ వస్తువులు, బ్యూటీ, అలంకరణకు ఉపయోగించే వస్తువులు, గృహోపకరణాలు వంటి 20 కోట్ల వస్తువులు అందుబాటులోకి రానున్నాయి. దీనిలో ఎంపిక చేసుకొనేందుకు విస్తృత శ్రేణిలో వస్తువులు లభించటమే కాకుండా ఎంఆర్పీ ధర కంటే ఖచ్చితంగా తక్కువకు లభించటం పారిపాటి. ఇంచుమించు ప్రతి వస్తువు మీద డిస్కౌంట్ లభించటం గ్రేట్ ఇండియన్ సేల్ ప్రత్యేకత.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/