విడాకుల్లో రికార్డు సృష్టించబోతున్న జెఫ్‌ బెజోస్‌!

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విడాకులు

jeff Bezos and MacKenzie Bezos
jeff Bezos and MacKenzie Bezos

వాషింగ్టన్‌: అమెజాన్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ తన విడాకుల సెటిల్‌మెంట్‌ విషయంలో రికార్డు సృష్టించబోతున్నారు. జెఫ్‌ బెజోస్‌ విడాకుల భరణం కింద ఆయన తన భార్య మెకంజీకి సుమారు 38.3బిలియన్‌ డాలర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు వాషింగ్టన్లోని సీటెల్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. తొలుత మెకంజీకి 68 బిలియన్‌ డాలర్లు అందే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ న్యాయమూర్తి 38.3 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదిర్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విడాకుల్లో అగ్రస్థానంలో జెఫ్‌ బెజోస్‌కే దక్కబోతుంది. కాగా జెఫ్‌ బెజోస్‌ తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/