తెలుగు రాష్ట్రాల్లో ఆమెజాన్‌ ఈజీ స్టోర్స్‌ పేరుతో ఆఫ్‌లైన్‌ స్టోర్లు

స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఈ అవకాశం కల్పించనున్న ఆమెజాన్‌

amazon-easy-store-in-telangana-and-andhra-pradesh
amazon-easy-store-in-telangana-and-andhra-pradesh

హైదరబాద్‌: ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్‌ కంపెనీ ఆమెజాన్‌ మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈజీ స్టోర్‌ పేరుతో ఆఫ్‌-లైన్‌ స్టోర్ల ఏర్పాటు చయబోతోంది. అయితే, ఇందుకోసం ఆమోజాన్‌ భాగస్వాములను వెతుకుతోంది. తానే స్వయంగా స్టోర్లు ఏర్పాటు చేసే బదులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఈ అవకాశం కల్పిస్తోంది. వారు చేయాల్సిందల్లా సొంతంగా ఒక స్టోర్‌ను నెలకొల్పాలి. దానికి డిజైన్‌ సలహాలు, సూచనలు అన్నీ ఆమోజాన్‌ ఇస్తుంది. అతి తక్కువ పెట్టబడితో ఈ స్టోర్లను నెలకొల్పే అవకాశం ఉండటం మరో విశేషం. అమ్మకాలపై ఆకర్షణీయమైన కమిషన్‌ కూడా అందించబోతుంది. కేవలం ఈ-కామర్స్‌లోనే కాకుండా గ్రోసరీస్‌ డెలివరీ, పుడ్‌ డెలివరీ సహా అనేక ఇతర రంగాల్లో విస్తరించాలన్న ఆమోజాన్‌ ప్యూహంలో భాగంగానే ఈజీ స్టోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/