భారత్‌లో అమెజాన్ వ్యాపారం భేష్

అమెరికా: భారత్‌లో ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యాపారం బాగుందని, దేశంలో నియంత్రణ వ్యవస్థ పటిష్టం కావాలని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ జెఫ్ బెజోస్ అశాభావం వ్యక్తం చేశారు. తమ సంస్థ భారత్‌లో చాలా బాగా పనిచేస్తోందని, వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారత్‌లో డిజిటలైజేషన్ విధానాల గురించి అమెజాన్ ఆందోళనలకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా బెజోస్ ఈ విధంగా స్పందించారు. దేశంలో అమెజాన్ అధినేత అమిత్ అగర్వాల్ నాయకత్వం సామర్థ్యం అసాధారణమని, ఆయన పనితీరు బాగుందని బెజోస్ ప్రశంసించారు.
వచ్చే ఏడాది (2020) అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో చేరే ప్రశ్నను బెజోస్ ఖండించారు. తనకు చాలా ఇతర పనులు ఉన్నాయని, ప్రస్తుతానికి వాటిని పూర్తి చేయడంపై దృష్టి ఉందన్నారు. ప్రభుత్వాన్ని నడపడం, సంస్థను నడపడం రెండు వేర్వేరు లక్షణాలు కల్గినవని అన్నారు. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్‌తో పోటీ పడటానికి అమెజాన్ చాలా ఖర్చు చేస్తోంది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/