పవన్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి అమర్ నాథ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై తీవ్ర విమర్శలు చేసారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. విశాఖ గర్జన తర్వాత ఎయిర్పోర్ట్ లో వైస్సార్సీపీ మంత్రుల కార్ల ఫై జనసేన కార్యకర్తలు దాడి చేసారని , ఈ దాడి చేయించింది పవన్ కళ్యాణ్ అని వైస్సార్సీపీ నేతలు ఆరోపిస్తూ వారి ఫై కేసులు పెట్టడం , అరెస్ట్ చేయడం..అలాగే పవన్ కళ్యాణ్ విశాఖ ను వదిలి వెళ్లాలని నోటీసులు జారీ చేయడం ఇవ్వన్నీ కూడా ఉద్రిక్తతకు దారి తీశాయి. ప్రస్తుతం పవన్ వైజాగ్ లోని నోవాటెల్ ఉన్నారు. ఈ తరుణంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. పవన్ ను చూసేందుకు భారీ సంఖ్య లో అభిమానులు , కార్యకర్తలు అక్కడికి వస్తున్నారు.

ఇదిలా ఉంటె పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్ నాథ్. పవన్ ఒక రాజకీయ ఉగ్రవాది అంటూ గుడివాడ అమర్‌నాధ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై పవన్ కక్ష కట్టారని, మూడు రోజుల కాల్షీట్ తీసుకుని విశాఖ వచ్చారని విమర్శించారు. రెండు రోజుల పాటు విశాఖలో పొలిటికల్ షూటింగ్ పెట్టుకున్నారంటూ ఆరోపించారు. విశాఖ గర్జనను డైవర్ట్ చేసేందుకే పవన్ జనవాణి పెట్టుకున్నారని, శనివారం జరిగిన దాడి మూడు రాజధానుల ఉద్యమంపై జరిగిన దాడిగా మంత్రి అభివర్ణించారు. విశాఖపట్నం నటన నేర్పిందని, పిల్లనిచ్చిందని, పోటీ చేయడానికి ఒక సీటును ఇచ్చిందని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. పెళ్లి చేసుకున్న ప్రతిచోట రాజధాని పెట్టారా? అంటూ పవన్ కల్యాణ్ బాధ్యతారహితంగా మాట్లాడారని మంత్రి విమర్శించారు. మూడు పెళ్లిళ్ల విధానంలా జనసేన పార్టీ ఉందన్నారు. గత పదేళ్ల క్రితం డెక్కన్ క్రానికల్ ఆఫీసు మీదకు ఆవేశంతో గన్ను పట్టుకుని వెళ్లిన పవన్‌ను చూస్తే ఆయన మనస్తత్వం ఎంత క్రూరంగా ఉండో తెలుస్తోందన్నారు. గన్ లైసెన్స్ ఇస్తే డెక్కన్ క్రానికల్‌ యాజమాన్యాన్ని బెదిరిస్తావా? అంటూ అప్పటి విషయాన్ని గుర్తు చేశారు.