కులాలు, వర్గాలకు అతీతంగా ప్రజలు ఓటేశారు : అమరీందర్ సింగ్
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ ఓటమి.. ఆమ్ ఆద్మీపార్టీకి శుభాకాంక్షలు

పంజాబ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పరాజయం పాలయ్యారు. పాటియాలా అర్బన్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగిన ఆయన.. ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ చేతిలో ఓటమి చవిచూశారు. తన ఓటమిని ఆయనే స్వయంగా అంగీకరించారు. అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలిచిందంటూ కామెంట్ చేశారు. పంజాబ్ లో అధికారంలోకి రాబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పంజాబ్ ప్రజలు నిజమైన ఆదర్శం చూపించారని, కులాలు, వర్గాలకు అతీతంగా ఓటేసి తామేంటో నిరూపించారని కొనియాడారు. భగవంత్ మన్ కు ఆయన అభినందనలు తెలిపారు.
కాగా, కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక ఆయన సొంతంగా పార్టీని స్థాపించి.. బీజేపీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూతో గొడవల నేపథ్యంలో ఆయనకు పార్టీ అధిష్ఠానం నుంచి మద్దతు కరవైంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/