మహిళలపై అక్రమ కేసులపై గవర్నర్‌కు ఫిర్యాదు

గవర్నర్‌ను కలిసిన అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసి

Amaravati JAC meets Governor
Amaravati JAC meets Governor

అమరావతి: ఏపి రాజధానిని రక్షించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసి మంగళవారం ఏపి గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను కలిసింది. రాజధానిలో జరుగుతున్న పరిణామాలు, అక్రమ కేసులపై మహిళా జేఏసి సభ్యులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మహిళా జేఏసి మీడియాతో మాట్లాడుతూ… అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళలపై అక్రమ కేసులు నమోదు చేశారని, శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే వైఎస్‌ఆర్‌సిపి నేతలు దాడులు చేస్తున్నారని తెలిపారు. నందిగం సురేష్‌ తమపై తప్పుడు కేసులు పెట్టించి భయపెడుతున్నారని మహిళలు ఆరోపించారు. తమపై పోలీసులు దాడికి పాల్పడిన ఫోటోలను గవర్నర్‌కు అందజేశామన్నారు. మొత్తం రాజధానిలో 2,800 మందిపై కేసులు పెట్టారని మహిళా జేఏసి పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/