రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది

రాజధానిపై జీవీఎల్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

kesineni nani
kesineni nani

అమరావతి: రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. నేడు అమరావతి పరిరక్షణ సమితి కార్యలయాన్ని విజయవాడలోని ఆటోనగర్‌లో ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతుల మీదుగా కార్యలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని బిజెపి ఎంపీ జీవీఎల్‌ చెబుతున్నారు. ఇందులో రాష్ట్రానికి ఎంత సంబంధం ఉందో.. కేంద్రానికి కూడా అంతే బాధ్యత ఉందని అన్నారు. రాజధానిపై జీవీఎల్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని కేశినేని డిమాండ్‌ చేశారు. ఇంకా ఏపీ ప్రభుత్వం పోలీసులపైకి నెపం నెట్టి అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజస్వామ్యం లేదని, ఇలాంటి దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలేదని కేశినేని దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/