ఫిల్మ్ చాంబర్ వద్ద ఐకాస నేతలు, విద్యార్థుల ఆందోళన

రైతుల ఉద్యమానికి సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలి : సీపీఎం రామకృష్ణ

jac-students-protest
jac-students-protest

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట ఈరోజు ఉదయం ఐకాస నేతలు, విద్యార్థులు రాజధాని అమరావతి రైతుల ఆందోళనలకు తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. సీపీఎం నేతలు వారికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులకు వినతిపత్రం సమర్పించారు. సీపీఎం రామకృష్ణ మాట్లాడుతూ, ఏపీలో గత యాభై రోజులకు పైగా రైతుల ఉద్యమం కొనసాగుతోందని, ఆ ఉద్యమానికి సినీ పరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున నిలబడే బాధ్యతను కవులు, కళాకారులు, సాంస్కృతిక బృందాలు తీసుకోవాలని, అందుకే, సినీ పరిశ్రమను కూడా మద్దతు తెలపాలని కోరుతున్నామని అన్నారు. ఏపీలో ఎనభై నాలుగు శాతం మంది ప్రజలు రాజధానిగా అమరావతే ఉండాలని కోరుకుంటున్నారని, ప్రజాభిప్ర్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/