చంద్రబాబును విమర్శించిన రాజధాని రైతులు

Chandrababu
Chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు తమను మోసం చేశాడంటూ రాజధాని రైతులు తీవ్రంగా విమర్శించారు. తూళ్లూరులో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాజధాని రైతులు, కూలీలు పాల్లొన్నారు. చంద్రబాబు కుంభకోణమే అసలు కోణం అనే పేరు మీద ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రైతులు, రైతు కూలీలతో పాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సహా బిజెపి, సిపిఐ నేతలు, దళిత, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. చంద్రబాబు రాజధాని పేరుతో రైతులకు అన్యాయం చేశారని, అందుకే ఇటీవల పర్యటించినప్పుడు నిరసనలు వ్యక్తం చేశామని రైతులు పేర్కొన్నారు. ఆయన బంధువులకు రాజధానిలో భూములు ఉన్నాయని, ఈ భూములను టిడిపి నేతలు తమ ఆధీనంలో ఉంచుకున్నారని రైతులు ఆరోపించారు. రైతు సంఘం నేత శేషగిరిరావు మాట్లాడుతూ.. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో అవినీతి జరిపారని, సిఆర్‌డిఏలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. రాజధాని పేరుతో రూ. 58 వేలకోట్లు దోచేశారని, రైతులకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని మరచిపోమని శేషగిరిరావు అన్నారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలని ఈ సమావేశంలో రైతులు కోరారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/