‘బిల్లు’ ఉపసంహరణ పై జెఎసి స్పందన

దాదాపు 700 రోజులకు పైగా మూడు రాజధానుల ప్రకటనను రద్దు చేయాలంటూ అమరావతి రైతులు నిరసన బాట చేపట్టిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల వారి నిరసనకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మూడు రాజధానుల చట్టాన్ని జగన్ సర్కార్ వెనక్కు తీసుకుంది. దీంతో ఏపీ వ్యాప్తంగా అంత సంబరాలు చేసుకుంటున్నారు. రాజధానుల చట్టం ఉపసంహరణపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమరావతి ఐకాస ప్రకటించింది.
ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని ఐకాస కోరింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్న ఐకాస నేతలు.. ఇన్నాళ్లూ అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహాపాదయాత్ర కొనసాగుతుందని… ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
మరోపక్క సీఎం జగన్ అసెంబ్లీలో ఏం ప్రకటన చేస్తారనే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే అమరావతి రాజధానిగా ఉంచుతారా..? లేదా కొత్తగా ఏం ప్రతిపాదిస్తారు అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓకే రాజధాని అమరావతి అంటూ ఇన్ని రోజులుగా రాజధాని రైతులు తిరుగులేని పోరాటం చేశారు. వారికి మద్దతుగా సీఎం జగన్ నిలుస్తారా ? అనే ఉత్కంఠత నెలకొంది.