ఏపి మంత్రి శ్రీనివాసరావు ఇంటి ఎదుట ధర్నా

Vellampalli Srinivas Rao
Vellampalli Srinivas Rao

అమరావతి: రాజధాని రైతుల నిరసనలతో ఏపి హోరెత్తిపోతుంది. మరో పక్క రాష్ట్రంలోని ప్రజలు స్వచ్ఛందంగా రైతులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అటు విద్యార్థులు సైతం రైతులకు అండగా నిలబడి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఏపి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటిని రాజధాని రైతులు ముట్టడించారు. ఆయన ఇంటి ఎదుట అమరావతి పరిరక్షణ సమితి పేరిట ధర్నాకు దిగారు. ఒక రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో నిరసన చేపట్టారు. కాగా పోలీసులు సమితి నేతలను అరెస్ట్‌ చేశారు. మరోవైపు స్థానికి రైతులు మంగళగిరి ఎమ్మెల్యె రామకృష్ణ కనపడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయండం గమనార్హం. అమరావతిలో ఇంత ఆందోళన జరుగుతున్నా ఎమ్మెల్యె తమను పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/