న్యాయమూర్తులను వేడుకుంటున్న రైతులు

55వ రోజుకి చేరిన అమరావతి రైతులు ఆందోళన

Amaravati farmers protest
Amaravati farmers protest

అమరావతి: ఏపి రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతుల నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఉదయం వినూత్నంగా నిరసనకు దిగారు అక్కడి రైతులు. హైకోర్టుకు న్యాయమూర్తులు వెళ్లే దారిలో బారులు తీరి దండాలయ్యా…మా మొర ఇనండయ్యాగ అంటూ వేడుకున్నారు. న్యాయమూర్తులు వచ్చే సమయంలో దండం పెడుతూ తమ గోడు వినిపించుకునే ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ న్యాయమూర్తులైనా తమ మొర ఆలకిస్తారన్న ఉద్దేశంతో ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అలాగే, కృష్ణాయపాలెం శివాలయం సెంటర్‌లో గులాబీపూలు పంచుతూ రైతులు నిరసన తెలియజేశారు. కాగా గత 55 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/