చినకాకాని హైవే వద్ద తీవ్ర ఉద్రిక్తత

మంత్రుల వాహనాలు కూడా ముందుకు కదలని పరిస్థితి

chinakakani Highway
chinakakani Highway

అమరావతి: అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న ఆందోళనల్లో భాగంగా చినకాకాని వద్ద హైవేను దిగ్బంధించిన విషయం తెలిసిందే. రైతుల నిరసనలతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం, మంత్రుల వాహనాలు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన కారులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. అంతకు ముందు హైవేపై ఉన్న వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెబుతూ లాఠీఛార్జీ చేస్తుండడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/