23వ రోజుకి చేరిన రైతుల ఆందోళనలు

శ్రమదానంతో రాజధాని నిర్మాణం చేపడతామన్న రైతులు

Amaravati Farmers
Amaravati Farmers

అమరావతి: రాజధాని ప్రాంతాల్లో కొనసాగుతున్న నిరసనలు 23వ రోజుకి చేరాయి. మందడం, తూళ్లూరు తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి రైతులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున్న ఆందోళనలో పాల్గొంటున్నారు. మూడు రాజధానులు వద్దు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, సేవ్‌ అమరావతి అంటూ రైతులు, విద్యార్థులు నినదించారు. మందడంలో రైతులు రోడ్లపైనే టెంటు వేసుకుని దీక్షను కొనసాగిస్తున్నారు. జాతీయ జెండాలు, ప్రధాని మోడి ఫ్లెక్సీలతో పలువురు ధర్నాలో కూర్చున్నారు. అటు తూళ్లూరులోనూ ధర్నా చౌక్‌ వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు సంఘీభావంగా దళిత జేఏసి నాయకులు ఒక్క రోజు దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే శ్రమదానంతో రాజధాని నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/