రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు
ఉపరాష్ట్రపతిని కలిసిన రాజధాని రైతులు

న్యూఢిల్లీ: అమరావతి రైతులు, ఐకాస నేతలు మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి రాజధాని సమస్యలు వివరించారు. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు, మహిళలు, నిరసనకారులపై పోలీసుల దాడుల గురించి ఉపరాష్ట్రపతికి వివరించారు. రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిని కూడా కలిసెందుకు సమయం కోరామని అపాయింట్మెంట్ రాగానే వెళ్లి అమరావతి అంశాన్ని వివరిస్తామని తెలిపారు. రాజధాని రైతులతో పాటు ఎంపీలు గల్లా జయదేవ్, సీతారామలక్ష్మీ తదితరులు వెంకయ్యనాయుడిని కలిసిన వారిలో ఉన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/