వ‌ర్షంలోనూ అమ‌రావ‌తి రైతుల మహా పాదయాత్ర

గొడుగులు, రెయిన్‌కోట్లు ధరించి రైతుల పాద‌యాత్ర‌

అమరావతి: అమరావతి రాజ‌ధాని రైతులు చేస్తోన్న‌ మహా పాదయాత్ర కొన‌సాగుతోంది. రాజధాని రైతులు, మహిళలు ఈ రోజు వర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో వర్షం కురుస్తుండ‌డంతో గొడుగులు, రెయిన్‌కోట్లు ధరించి రైతులు పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు.

అయితే, నాగులుప్పలపాడు మార్గాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయ‌డం గ‌మనార్హం. అలాగే, త‌మ‌కు మ‌ద్ద‌తు తెలపడానికి వస్తున్న ప‌లువురిని పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గ‌త‌ రాత్రి రైతులు బస చేసిన గుడారాలు వాన‌కు తడిసిపోవ‌డంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తామ‌ని రైతులు చెబుతున్నారు. వారి పాద‌యాత్ర వ‌చ్చేనెల‌ 15న తిరుపతిలో ముగుస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/