రాజధాని రైతుల భారీ ర్యాలీ

మందడం శివవాలయం నుంచి విజయవాడ దుర్గమ్మ సన్నిధి వరకు

Amaravati farmers
Amaravati farmers

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గడచిన 33 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న రైతులు ఆదివారం భారీ ర్యాలీ ప్రారంభించారు. తొలుత మందడం ప్రధాన రహదారిపైనే నిరసన తెలియజేశారు. అనంతరం మందడం శివాలయం నుంచి బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి వరకు 13 కిలోమీటర్ల మేరకు ర్యాలీకి సిద్ధమయ్యారు. అమ్మవారికి మొక్కుతీర్చుకునేందుకు బయలుదేరిన వీరు మార్గమధ్యలో స్థానిక మహిళలను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాక రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలని వేడుకోనున్నట్లు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/