ఎల్లప్పుడూ అనందంతో గడపాలి

మనస్విని: వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం

మేడమ్‌ నా వయస్సు 55 సంవత్సరాలు. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెళ్లిళ్లు అయి పోయాయి. ఇద్దరూ వారి కాపురాలు వాళ్లు చేసుకుంటున్నారు. మాది ఉమ్మడి కుటుంబం. అందరూ కలసే ఉంటున్నాము. కలసి ఉండటం వల్ల ఏదో మనః స్పర్థలు వస్తున్నాయి. వాళ్లు అప్పడప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు. దీనివల్ల నాకు చాలా బాధకలుగుతోంది. ఏంచేస్తే మేము మరల అంతా బాగుండగలము. కొంచెం వివరించండి ప్లీజ్‌.
– శ్రీదేవి, హైద్రాబాద్‌

మీరు తప్పక అందరూ బాగుండగలరు. అవగాహన పెంపొదించుకోవడం వల్ల, ఒకరి నొకరు అర్థం చేసుకోవటం వల్ల, అందరూ బాగుండగలరు. ఎవరూ ఎవరి మీద ఆధార పడకుండా, ఎవరిపనులు వారు చేసుకోవాలి. ఎవరి తప్పులు వారు గ్రహించాలి. మనకు ఏదైనా బాధ కలిగితే దానిని మనం మనమే బాధ్యులం. స్వయంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బంధాలను గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు. ఒకరినొకరు గౌరవించు కోవాలి.

ఒకరినొకరు స్వతంత్రంత ఇచ్చి పుచ్చుకోవాలి. ఒకరి మీద ఒకరు ఆధారపడటం వల్ల. ఎన్నో సమస్యలు గొడవలు వస్తాయి. వీలైనంతవరకు ఎవరిపని వారే చేసుకోవాలి. ఎదుటివారు సహాయం, వారికి వారి అందిస్తే, తప్పక పుచ్చుకోవచ్చు.

ఇచ్చిపుచ్చుకొంటే బంధాలు నిలబడతాయి. ఎల్లప్పుడూ ఒకరే ఇస్తూ ఉంటే, గొడవలు మొదలవు తాయి. జీవితం అమూల్యమైనది. ఎప్పుడూ గొడవలు పడకూడదు. ఆనందంగా ఉండాలి. గృహవాతా వరణం ఎల్లప్పుడూ ఆనందంగా మలచుకోవాలి. ఎవరిపరిధిలో వారు ఉండాలి. మీరుకూడా మీ విలువను గుర్తించి. అవతలి వారుకూడా గుర్తించేటట్లు ప్రవర్తించాలి. లేకపోతే వారు మమ్మల్మి ఎక్కువగా ఉపయోగించుకొని కృతజ్ఞ్ఞత అనేది లేకుండా ఉంటారు. ఇది తప్పక చేయవలసిన పని.

మేడమ్‌, నా వయసు 35 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త ఒక ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగంచేస్తున్నారు. ఆయనకు పని వత్తిడి ఎక్కువ. అందువల్లనాకు ఇంటిపనిలో సాయం చేయలేదు. అందువల్ల మా ఇద్దరికీ పని ఎక్కువై పోతున్నది. అందువల్ల ఆరోగ్యం కూడా చడిపోతున్నది. ఏంచేస్తే మేము మరలా ఆరోగ్యవంతులవ్వగలమా? కొంచెం వివరించండి మేడమ్‌. – పరిమళ, వరంగల్‌..

మీరు తప్పక ఆరోగ్యవంతులవ్వగలరు. ఇద్దరూ ఆహాల్లదంగా, పనులు చేసుకోవాలి. ప్రాధమ్యాలను గుర్తించాలి. చాలా ముఖ్యమైన పనులు మాత్రమే పనులు చేసుకోవాలి. అన్నీ చెయ్యాలని అనుకోవద్దు. వత్తిడి మన మనస్సులో నుండి వస్తుంది. అందువల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. పనులు ఇష్టపడి చేయ్యాలి. కష్టపడికాదు. జీవితం సరలమైనది.

తియ్యనిది. దీనిని సమస్యల భరితంగా చేసుకోవద్దు. అవగా హనతో జీవించాలి. స్పష్టతతో ఉండాలి. ఎల్లప్పుడు ఆనంతంగా ఉండాలి. ఇది తప్పని సరి. బంధాలు ఆనందంతో,ప్రమతో నిండి ఉండాలి. ఒకరికొకరు భారం కాకూడదు. ప్రతిక్షణం విలువైంది.

ప్రతిరోజూ పండుగలాగాజరుపుకోవాలి. మంచి ఆహారం, మంచి నిద్ర ఉండాలి. మీ కిష్టమైన పనులు చేసుకొంటూ ఆనందంగా గడపాలి. భయాలు వద్దు. ఆదందోళన, వత్తిడి వద్దు. వర్తమానంలో జీవించాలి. వీలైతే కౌన్సిలింగ్‌ తీసుకోండి. మనస్సు, హృదయం ప్రశంతంగా ఉండాలి. ఉత్సాహంతో జీవితం గడపాలి. బాధలతో సమస్యలతో కాదు. ఎల్లప్పుడూ ఆనందంతో గడపాలి.
ఇది తప్పనిసరి.

డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/