భారీగా పెరిగిన సందర్‌ పిచాయ్‌ వార్షిక వేతనం

Sundar Pichai
Sundar Pichai

శ్రాన్‌ ప్రాన్సిస్కో: ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పొరేట్‌ సీఈవోలలో సందర్‌ పిచాయ్‌ ఒకరు. తాజాగా గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సుందర్‌ పిచాయ్‌ కి భారీగా వేతనం పెరిగింది. ఆయన అత్యంత శక్తివంతమైన సాంకేతిక దిగ్గజాల్లో ఒకరుగా నిలిచిన పిచాయ్‌ ఇపుడు అతిపెద్ద స్టాక్‌ అవార్డును పొందనున్నారు. రాబోయే మూడేళ్లలో పనితీరు-ఆధారిత స్టాక్‌ అవార్డు రూపంలో 240 మిలియన్‌ డాలర్లు అందుకుంటారు. అలాగే 2020 నుండి పిచాయ్‌ అందుకోనున్న (టెక్‌హోం) వార్షిక వేతనం 20 లక్షల డాలర్లు. ఈ మేరకు శుక్రవారం అందించిన అల్ఫాబెట్‌ అందించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అంతేకాకుండా ఆల్ఫాబెట్‌ షేర్ల విలువ పెరుగుదలకు అనుగుణంగా 90 మిలియన్‌ డాలర్ల విలువగల షేర్ల అదనపు బోనస్‌గా లభించనున్నాయి. ఈ విధంగా పనితీరును బట్టి బోనస్‌గా ఇవ్వటం కాలిఫోర్నియాలో నెలకొన్న ఆల్ఫాబెట్‌ కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. లారీపెజ్‌ నిష్క్రమణ అనంతరం డిసెంబర్‌ 3న సుందర్‌ పిచాయ్‌ ఆల్ఫాబెట్‌ పగ్గాలు చేపట్టిన సంగతి విదితమే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/