ఆకట్టుకుంటున్న అల్లుడు అదుర్స్ ట్రైలర్

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వస్తోంది. ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకునేకుంద బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండటంతో, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి.

కాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యాంతం ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండటంతో ‘అల్లుడు అదుర్స్’తో అదుర్స్ అనిపించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక గతంలో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన కందిరీగ చిత్ర తరహాలో అల్లుడు అదుర్స్ అన్ని కమర్షియల్ అంశాలను మిలితం చేసుకుని ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో బెల్లంకొండ బాబు యాక్షన్‌తో పాటు కామెడీని కూడా అద్భుతంగా పండించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, సోనూ సూద్, ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ చేస్తున్నారు.

YouTube video