నేడు అల్లు స్టూడియో గ్రాండ్ ఓపెనింగ్..

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించిన అల్లు స్టూడియో నేడు మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. అల్లు కుటుంబం వారు హైదరాబాద్ లో ఒక సినీ స్టూడియో నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ‘అల్లు స్టూడియో’ పేరుతో గండిపేట వద్ద లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా గత ఏడాది దీని గురించి అధికారిక ప్రకటన చేశారు.ఈ స్టూడియో అంత సిద్ధం కావడం తో ..నేడు అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఈ స్టూడియోస్ ని ఘనంగా చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేష్, అల్లు కుటుంబ సభ్యులు ఈ ప్రారంభంలో భాగంకాబోతున్నారు.

ఇక స్టూడియోలో షూటింగ్ జరుపుకోనున్న మొదటి సినిమా అల్లు అర్జున్ నటించనున్న ”పుష్ప: ది రూల్” అని తెలుస్తోంది. సినిమా షూటింగ్ లకు అన్నీ అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో 10 ఎకరాల స్థలంలో “అల్లు స్టూడియోస్” విలాసవంతంగా నిర్మితమైంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉండడం వల్ల స్టూడియో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక బయటి వ్యక్తులకు అనుమతి లేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.