పుష్పరాజ్ టీజర్: తగ్గేదే లే అంటోన్న బన్నీ

పుష్పరాజ్ టీజర్: తగ్గేదే లే అంటోన్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’కు సంబంధించిన హీరో ఇంట్రొడక్షన్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినప్పుటి నుండి ఈ టీజర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తు్న్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ పాత్రకు సంబంధించిన ఇంట్రో టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ టీజర్‌లో బన్నీ ఊరమాస్ లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రానుండగా, ఇందులో బన్నీ పాత్ర చాలా రఫ్‌గా ఉండబోతుందని ఈ టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. ఇక ఈ టీజర్‌లో బన్నీ ఒకే ఒక్క డైలాగ్ చెప్పడం విశేషం. ‘తగ్గేదే లే’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌ను బన్నీ పవర్‌ఫుల్‌గా చెప్పడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి పుష్ప చిత్రంతో బన్నీ-సుకుమార్ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారనే విషయం ఈ టీజర్‌తో స్పష్టం అవుతోంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తు్న్నాడు. మరి పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.