అనిల్ రావిపూడితో బన్నీ మూవీ.. మామూలుగా ఉండదట!

అనిల్ రావిపూడితో బన్నీ మూవీ.. మామూలుగా ఉండదట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ అనుకుంటున్న సమయంలో మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా తెరకెక్కించేందుకు బన్నీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు బన్నీ సిద్ధమైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతేడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత బన్నీతో సినిమా చేసేందుకు కథను రెడీ చేయనున్నాడట ఈ డైరెక్టర్.

ఇప్పటికే బన్నీకి ఓ స్టోరీలైన్ వినిపించగా, అది విన్న బన్నీ చాలా ఇంప్రెస్ అయ్యాడట. దీంతో అనిల్ రావిపూడిని ఈ సినిమా కథను పూర్తిగా డెవలప్ చేయమని కోరాడట. మరి ఈ కాంబోలో ఎలాంటి సినిమా రానుందా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.