అల్లు అర్జున్ నయా లుక్ ..శ్రీవల్లి రియాక్షన్ మాములుగా లేదు

పుష్ప మూవీ తో పాన్ హిట్ అందుకున్న అల్లు అర్జున్..ప్రస్తుతం వరుస యాడ్స్ లలో నటిస్తూ బిజీ గా ఉన్నారు. పుష్ప తో భారీ క్రేజ్ రావడం తో బన్నీ ని తమ సంస్థలకు అంబాసిడర్‌గా పెట్టుకునేందుకు పలు వాణిజ్యసంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్‌లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న ఆయన తాజాగా మరికొన్నింటికి సైన్ చేశారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్స్‌లో ఆయా సంస్థల యాడ్స్‌ షూట్‌లో ఆయన పాల్గొన్నారు.

రెండు రోజుల అకృత్యం ప్రముఖ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌-బన్నీ కాంబోలో హైదరాబాద్‌లో ఓ యాడ్‌ షూట్‌ జరిగింది. ఈ యాడ్‌ కోసం బన్నీ తన లుక్‌ మార్చుకున్నారు. ఇందులో రింగుల జుట్టు, చెవి పోగులతో ఊర మాస్ గా కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోస్ ను ఆయన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేయగా దాన్ని చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బన్నీని గుర్తుపట్టలేకపోతున్నామంటూ కామెంట్స్‌ చేశారు. ఇక, నటి రష్మిక సైతం.. ”ఓ మై గాడ్‌.. అల్లు అర్జున్‌ సర్‌.. ఒక్క క్షణం పాటు మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను ‌” అంటూ పోస్ట్ పెట్టింది.