డ్రైవర్ కు ఆర్ధిక సాయం చేసిన అల్లు అర్జున్

Allu Arjun donates Rs 15 Lakhs to his driver

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఎవరు ఏ ఆపదలో ఉన్న తనవంతు సాయం చేసే అల్లు అర్జున్..తాజాగా తన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న మహిపాల్ అనే వ్యక్తికి రూ. 15 లక్షల ఆర్ధిక సాయం చేసాడట. బోరబండ వాసి మహిపాల్ గత పదేళ్లుగా అల్లు అర్జున్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మహిపాల్ స్వస్థలం వరంగల్. మొదటి నుండి ఎంతో నమ్మకంగా ఉండడంతో అల్లు అర్జున్ అతడ్ని తన వ్యక్తిగత డ్రైవర్ గా కొనసాగిస్తున్నారు. కాగా, మహిపాల్ బోరబండలో సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ అతడికి రూ.15 లక్షల ఆర్ధిక సాయం అందించారు. మహిపాల్ కుటుంబ సభ్యులను కలిసి ఈ మేరకు ఆర్థికసాయం అందించి వారిని సంతోషంలో ముంచెత్తారు. దీనికి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే..పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సాధించిన బన్నీ..ఇప్పుడు పుష్ప 2 కు సిద్దమవుతున్నాడు. వాస్తవానికి ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకావాల్సి ఉండగా, డైరెక్టర్ సుకుమార్ కథలో మార్పులు , చేర్పులు చేస్తుండడంతో సెట్స్ పైకి వెళ్లేందుకు ఆలస్యం అవుతుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా , దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.