శాకుంతలం కోసం డబ్బింగ్ చెపుతున్న అల్లు అర్హ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ..ఫస్ట్ టైం వెండితెర ఫై కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న శాకుంతలం మూవీ లో అల్లు అర్హ కనిపించబోతుంది. మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకోగా..రిలీజ్ కు బ్రేక్ లు పడుతూ వస్తుంది. ఈ మధ్యనే ఫిబ్రవరి 17 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు తెలిపారు. అలాగే చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. ఇందులో భాగంగా అల్లు అర్హ డబ్బింగ్ చెప్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్లు అర్జున్ తన కూతురు స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్న పిక్‌ను షేర్ చేస్తూ దానిపై హార్ట్ సింబల్ చిత్రీకరించాడు. ఇక అల్లు అర్హ ఇప్పటికే స్టైలిష్ స్టార్ కిడ్‌గా తండ్రి అడుగుజాడలను అనుసరిస్తుండగా.. ప్రస్తుతం ఈ ఫీట్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిచింది. అర్హ ఈ చిత్రంలో భరత యువరాజు పాత్రలో కనిపించనుండగా.. ట్రైలర్‌లో సింహంపై స్వారీ చేస్తూ వస్తున్న క్లిప్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుణ టీమ్‌వర్క్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా 2D, 3D వెర్షన్‌లో ఫిబ్రవరి 17 న విడుదల కానుంది.