నిర్భయ దోషుల కుటుంబీకులు రాష్ట్రపతికి లేఖ

తమకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలంటూ లేఖ

All four convicts in Nirbhaya case
All four convicts in Nirbhaya case

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులుగా ఉన్న నలుగురు నిందితుల కుటుంబసభ్యులు తమకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో వారి తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు ఉన్నారు. మన దేశంలో పెద్ద తప్పులు చేసిన వారికి కూడా క్షమాభిక్షను ప్రసాదించారని లేఖలో వారు పేర్కొన్నారు. ప్రతీకారం అనేది అధికారానికి నిర్వచనం కాదని… క్షమించడంలో కూడా అధికారం ఉందని చెప్పారు. మరోవైపు ఈనెల 20వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నలుగురు దోషులు పెట్టుకున్న క్షమాభిక్షలను రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/