మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు

ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికతో హోంశాఖ నిర్ణయం

Kurasala Kannababu
Kurasala Kannababu

అమరావతి: ఏపి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబకుకు హోంశాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. ఇంటెలిజెన్స్ శాఖ నివేదికతో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు వారం కిందట స్పష్టం చేశాయి. కన్నబాబు ఇకపై బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని నిఘా వర్గాల నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కన్నబాబుకు సూచనలు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల సూచనలను పాటించాలని నిర్ణయించుకున్న కన్నబాబు, తన తాజా పర్యటనలకు కొత్తగా కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగిస్తున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం చేయండి:https://www.vaartha.com/news/international-news/