ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ‘అల్లిపూల వెన్నెల’ బతుకమ్మ పాట విడుదల

ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ‘అల్లిపూల వెన్నెల’ బతుకమ్మ పాటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో పాటను ఆవిష్కరించారు. ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించగా, జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు. అక్టోబర్ 6 నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా ఘనంగా జరగనుంది.

తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే ఈ పండుగకు “అల్లిపూల వెన్నెల” మరింత శోభను తీసుకొస్తుందని.. ఈ పాటను తెలంగాణలోని వివిధ లొకేషన్లలో ఎంతో అందంగా చిత్రీకరించారు. పాటను విడుదల చేసిన సందర్భంగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ “బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు” తెలుపుతూ ట్విట్ చేశారు.