సిర్పూర్ ఎమ్మెల్యేపై ఆరోపణలు
విచారణ జరిపిస్తే నిరూపిస్తామంటున్న కాంగ్రెస్ నేత

కొమ్రంభీం: కొమ్రంభీం జిల్లా సిర్పుర్ నియోజక వర్గ ఎమ్మోల్యే కోనేరు కోనప్పపై భూకభ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, కోనప్ప భూకబ్జాకు పాల్పడ్డాడని కాంగ్రెస్ నేత పాల్వాయి హరిష్‌బాబు ఇతర కాంగ్రెస్ నేతలు హెచ్ఆర్సీకి పిర్యాదు చేశారు. ఇందులో కాగజ్‌నగర్‌లోని సర్వే నంబర్ 147లో రూ. 4 కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని ఎమ్మేల్యే కోనేరు కోనప్ప కబ్జాచేశారని ఆరోపించారు. దీంతో వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు నిలిపివేతతో పాటు.. విచారణకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. తదుపిరి విచారణను జూన్ 29 కి వాయిదా వేసింది. కాగా కోనప్పపై హెచ్ఆర్సీ విచారణ జరిపిస్తే తాము చేసిన ఆరోపణలను నిరూపిస్తామని కాంగ్రెస్ నేత పాల్వాయి హరీష్‌బాబు అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/