ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఎస్‌సీ పరీక్షలన్నీ రద్దు

విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల

Students
Students

Amarvati:  ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఎస్‌సీ, ఎఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ పరీక్షలన్నీ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2020 మార్చి నాటికి నవెూదైన టెన్త్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేస్తున్నట్లు ఉత్వర్వులు విడుదల చేసింది. ఈ విద్యార్థులకు ఎలాంటి గ్రేడ్స్‌ లేకుండానే పాస్‌ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

సుమారు ఏపీలో 6లక్షల మందికి పైగా పదో తరగతి విద్యార్థులు ప్రభుత్వం నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు.

గత మార్చిచివరివారంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పరీక్షల తేదీని ఖరారు చేయగా కరోనా వైరస్‌ కారణంగా పరీక్షలను వాయిదా వేస్తు వచ్చింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్ష నిర్వహణ సాధ్యం కాకపోవడంతో పరీక్షలను రద్దు చేస్తు హాల్‌ టికెట్లు ఉన్న వారందరినీ పాస్‌ చేస్తున్నట్లు ఉత్వర్వులు విడుదల చేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/