మే 3 వరకు అన్ని రైల్‌ సర్వీసులు రద్దు

ప్రకటించిన భారత రైల్వేశాఖ

train
train

దిల్లీ: దేశంలో ప్రధాని మోదీ మే నెల 3 వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పోడగిస్తు నిర్ణయించిన నేపథ్యంలో భారత రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. మే 3 వరకు దేశంలో అన్ని రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్యాసింజర్‌, ప్రీమియం, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, సబర్మన్‌ రైళ్లు, మెట్రో రైల్‌ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆన్‌లైన్‌లో టికెట్‌లు బుక్‌ చేసుకున్న వారందరికి డబ్బు రీఫండ్‌ చేస్తామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేష్‌ తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/