హైలికాప్టర్స్‌ బుకింగ్‌లో తిరుగులేని బిజెపి

హెలికాప్టర్‌కు గంటకు 4-5 లక్షలు చార్జీ

helicopter
helicopter

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు విరివిగా హెలికాఫ్టర్లు, ప్రైవేట్‌ జెట్‌ విమానాలు వాడుతుంటారు. ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేసేందుకు స్టార్‌ కాంపెయినర్లు తరచూ వీటిని వినియోగిస్తుంటారు. అయితే కాలం కన్నా విలువైనది ఏమి లేదనే సూత్రంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. 2019 ఎన్నికల్లో మాత్రం ప్రైవేట్‌ చార్టర్‌ విమానాలు, హెలికాప్టర్ల వినియోగంలో బిజెపి పార్టీ అన్ని పార్టీ కన్నా పై చేయి సాధించింది. ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందే బిజెపి పార్టీ తరపున ఏకంగా 20 ప్రైవేట్‌ జెట్‌ విమానాలు, 30 హెలికాప్టర్లను బుక్‌ అయ్యాయి. దీంతో ప్రతిపక్షాలకు హెలికాప్టర్లు, ప్రైవేట్‌ జెట్‌ విమానాలు దొరక్క లబోదిబోమంటున్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీ తరపున మాత్రం కేవలం 6 హెలికాప్టర్లు జెట్‌ విమానాలు మాత్రమే బుక్‌ అయ్యాయి.
బిజినెస్‌ ఎయిర్‌ క్రాఫ్‌ట ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వివరాలు తెలుపుతూ దేశంలో ఎన్నికల సందర్భవగా ప్రైవేట్‌ చార్టర్‌ వియానాలకు, హెలికాప్టర్లుకు విపరీతమైన డిమాండ్‌ ఉందని, అయితే డిమాండ్కఉ తగినట్లే కూడా రేట్లు ఉన్నాయన్నారు. సాధారణంగా ఒక్కో ప్రైవేట్‌ జెట్‌ విమానానికి గంటకు రూ.4 లక్షలు వస్లుఉ చేస్తుండగా, హెలికాప్టర్ల కోసం గంటలకు రూ. 5 లక్షల దాకా వసూలు చేస్తున్నామని తెలిపారు.
అయితే ఎవరైతే ముందుగా బుక్‌ చేసుకుంటారో, వారికూ మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ఇందులో ఎలాంటి భేషజాలు ఉండవని ప్రైవేట్‌ ఆపనేటర్స్‌ అంటున్నారు. ఇదిలా ఉంటే అధికార బిజెపి పార్టీకి మాత్రం ఈ సారి ఎన్నికల్లో ఖర్చుకు వెనుకాడ్డం లేదు.దీంతో దేశంలో అందుబాటులో ఉన్న అన్ని ప్రైవేట్‌ విమానాలను అద్దెకు తీసేకుంది. అయితే బిజెపి కుట్ర పేరితంగానే ఇతర పార్టీల నేతలకు విమానాలను అద్దెకు తీసేకుంది. అయితే బిజెపి కుట్ర పూరితంగానే ఇతర పార్టీల నేతలకు విమానాలు అందకుండా చేసిందని కాంగ్రెస్‌ అధకార ప్రతినాధి ఆనంద్‌ శర్మ విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/