ఏపీలో ప్రజలందరూ లాక్ డౌన్ పాటించాలి

మాజీ సీఎం చంద్రబాబు పిలుపు

ఏపీలో ప్రజలందరూ లాక్ డౌన్ పాటించాలి
Chandra babu Naidu

Amaravati: ఏపీలో ప్రజలందరూ లాక్ డౌన్ ను పాటించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

లాక్ డౌన్ కారణంగా వ్యవసాయ ఉత్పత్తి రంగాలు దెబ్బతింటున్నాయన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.

నిత్యావసరాల వస్తువుల ధరలను అదుపు చేయాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం సాయం చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు.

ఇలాంటి సమయంలో వైసీపీ రాజకీయ విమర్శలు చేస్తోందని, రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని హితవు పలికారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/