పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ

Parliament

న్యూఢిల్లీః పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో జరగనున్న భేటీకి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా మోడీ అన్ని పార్టీలను కోరనున్నారు. వైఎస్‌ఆర్‌సిపి తరఫున మార్గాని భరత్, టిడిపి నుంచి గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే ఛాన్సుంది.

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ఇవాళ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు. సాయంత్రం ఆరింటికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగే బిజినెస్ అడ్వైజరీ మీటింగ్ లో అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొననున్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో చర్చించాల్సిన అంశాలు, కీలక బిల్లులకు సమయం కేటాయింపు తదితర అంశాలపై బిజినెస్ అడ్వైజరీ మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/