ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

కేంద్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం

YouTube video
Cabinet Briefing by Union Ministers Prakash Javadekar, Giriraj Singh and Jitendra Singh

న్యూఢిల్లీ: ప్రధాని మోడి అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సహకార బ్యాంకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని అన్ని సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించి, అందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేశారు. భారత్‌లో 1,482 అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులతో పాటు 58 మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ఉన్నాయి. ఇకపై ఇవన్నీ ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఓ ప్రకటన చేశారు. దేశంలో అర్బన్‌ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. కాగా, దేశంలో పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియ కూడా మరింత సులభతరం కానుందని ఆయన తెలిపారు. ధ్రువీకరణ పత్రాల జాబితాను కేంద్ర ప్రభుత్వం కుదించినట్టు వివరించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/