ఆస్పత్రి నుంచి అలియా భట్ డిశ్చార్జ్

Alia Bhatt With Baby Girl DISCHARGED From Hospital

పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చిన అలియా భట్ ..హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ గత ఆదివారం పండింటి పాపకు జన్మనిచ్చారు. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్‏తో కలిసి ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా.. మధ్యాహ్నం సమయంలో ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ గుడ్ న్యూస్‌తో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చిత్రసీమ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేసారు.

ప్రస్తుతం అలియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రణబీర్ కపూర్, అలియా భట్ తమ బిడ్డను ఇంటికి తీసుకువెళ్లారు. అలియా భట్, రణబీర్ కపూర్‭తో కలిసి ఆస్పత్రి నుంచి వెళుతున్న ఫోటోలు బయటికి వచ్చాయి. అలియా, రణబీర్‭లు తమ ఇంటికి ఆడపిల్ల వచ్చిందంటూ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. తమ జీవితంలో ఇది మరుమరాని విషయం అంటూ వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక తమ ఇంటికి ఆడపిల్ల వచ్చిన సందర్భంగా రణబీర్ తల్లిదండ్రులు సంబరాలు జరిపారు. ఇంటి వద్ద అలియా భట్‭కు ఘన స్వాగతం పలికారు.

అలియా – రణబీర్ ప్రేమించి ,పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ఆలియా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించి షాక్ ఇచ్చారు.