ఆల్జీరియాలో విద్యార్థుల నిరసన

Algerian university students
Algerian university students

ఆల్జీర్స్‌: అల్జీరియా విద్యార్ధులు వరసగా 20 వ వారం వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.వినీతి నిరోధక చర్యలను పటిష్టంగా చేపట్టాలన్న డిమాండ్‌ మధ్య దేశంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనను తొలగించే ప్రయత్నంలో భాగంగా వారు ఈ నిరసన చేస్తున్నారు. అల్జీరియా సైన్యాధ్యక్షుడు జనరల్‌ అహ్మద్‌ గెయిడ్‌ సలాజు్‌ా విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ బెర్బర్‌ కమ్యూనిటికి చెందిన అమజిగ్‌ ఫ్లాగ్‌ సంస్ధ ప్రదర్శనను నిర్వహించింది. అరబ్బులకు, బెర్బర్లకు మధ్య పెరుగుతున్న ఐక్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న అధికారులు ప్రదర్శనలపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అల్జీరియా స్వాతంత్య్ర పోరాట నేత లఖ్దర్‌ బౌరెగా తో సహా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఔజెల్లగ్యున్‌లో జరిగిన ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు. ప్రతిపక్షంపై జరుగుతున్న అణిచి వేతలో భాగంగా గత వారం ఆయనను జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు జరిగిన నాలుగు గంటల సాధారణ సమ్మెతో పాటు వీధి ప్రదర్శనలు కొనసాగాయి. మాజీ పాలకుడు అబ్దెలాజిజ్‌ బౌటెఫ్లికాతో సంబంధమున్న అధికారులందరూ రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తూ ప్రదర్శనలు కొనసాగాయి .


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/