వచ్చే ఎన్నికల బరిలో తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి..?

నందమూరి తారకరత్న మరణం నందమూరి కుటుంబం లోనే కాదు టీడీపీ శ్రేణుల్లో కూడా విషాదాన్ని నింపింది. ఇప్పుడెప్పుడు పార్టీ లో బిజీ అవుతూ..రాబోయే ఎన్నికల్లో బరిలో నిల్చువాలని ఎన్ని కలలు కన్నా తారకరత్న ..ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. గుండెపోటుకు గురై, దాదాపు 23 రోజులు మృతువు తో పోరాడి చివరకు ప్రాణాలు వదిలాడు. తారకరత్న మరణంతో ఒంటరి అయ్యింది ఆయన భార్య అలేఖ్యా రెడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకున్న తారకరత్న ఇక లేడు అనేది తట్టుకోలేకపోతుంది. కుటుంబ సభ్యులు , స్నేహితులు ఎంత నచ్చ చెప్పిన ఆమె విషాదం నుండి బయటకు రాలేకపోతుంది.

ఈ తరుణంలో బాలకృష్ణ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ..తారకరత్న కోరిక తీర్చాలని చూస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో తారకరత్న టిడిపి తరఫున పోటీ చేయాలని భావించిన నేపథ్యంలో, తారకరత్నకు ఇవ్వాలి అనుకున్న అవకాశాన్ని అలేఖ్య రెడ్డికి ఇవ్వాలని బాలకృష్ణ భావిస్తున్నారని సమాచారం. ఇక ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పి టీడీపీ పార్టీ మహిళా విభాగంలో ఆమెకి కీలక పదవి ఇవ్వాలని, వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆమెకు అవకాశం ఇవ్వాలని బాలకృష్ణ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.

తారకరత్న పైన ప్రజల్లో ఉన్న అభిమానం నేపథ్యంలో అలేఖ్య రెడ్డిని కూడా ప్రజలు ఆదరిస్తారని, ఇక ఇదే సమయంలో అలేఖ్య రెడ్డి రాజకీయాలలో బిజీ అయితే కాస్త తారకరత్నలేని బాధనుండి బయటపడే అవకాశం ఉంటుందని బాలకృష్ణ భావిస్తున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.