వేలంలో భారీ ధర పలికిన ఐన్‌స్టీన్‌ లేఖ

Einstein's 'God letter'
Einstein’s ‘God letter’

న్యూయార్క్‌: ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ రాసిన గాడ్‌ లెటర్‌ వేలంలో భారీ ధర పలికింది. ఆయన చనిపోవడానికి కేవలం ఒక సంవత్సరం ముందు దేవుడు, మతంపై తన ఆలోచనలకు రూపం ఇస్తూ లేఖలో రాశారు. తనకు సంబంధించి దేవుడు అనే పదం ఓ వ్యక్తీకరణ అని, మనుషుల బలహీనత నుంచి వచ్చిందని ఐన్‌స్టీన్‌ లేఖలో పేర్కోన్నారు. ఐతే ఈ లేఖను అమెరికాలో క్రిస్టీన్‌ సంస్థ వేలం వేయగా 1.5 మిలియన్‌ డాలర్లు పలుకుతుందని అంచనా వేయగా, 2.89 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 20 కోట్లు) పలికింది. దాదాపు రెండు పేజీల ఆ లేఖను ఐన్‌స్టీన్‌ 1954 జనవరి 3వ తేదీన రాశారు.