ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కు మాతృవియోగం

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి అరుణా భాటియా ముంబైలోని ఆ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. రీసెంట్ గా తన తల్లి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొన్న అక్షయ్ కుమార్ ..షూటింగ్ నిమిత్తం యూకే లో ఉండగా..వెంటనే ముంబైకి తిరిగి వచ్చి తన తల్లి ట్రీట్‌మెంట్‌పై దృష్టిపెట్టారు.

అక్షయ్ తల్లి ఆరోగ్యం క్షీణించిందనే విషయం తెలుసుకొన్న నెటిజన్లు ఆమె ఆరోగ్యం మెరుగుపడాలని సోషల్ మీడియాలో ప్రార్థించారు. అరుణా భాటియా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. నెటిజన్ల ప్రార్థనల నేపథ్యంలో నా తల్లి ఆరోగ్యం గురించి మీరు చేస్తున్న ప్రార్థనలతో నా హృదయం భావోద్వేగంతో భారంగా మారింది అని అక్షయ్ కుమార్ మంగళవారం ట్వీట్ చేశారు. కానీ తల్లిని బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాల విఫలం కావడంతో దు:ఖసాగరంలో అక్షయ్ కుమార్ మునిపోయాడు.

తల్లి మరణంలో నేపథ్యంలో అక్షయ్ ట్వీట్ చేసారు. నాకు నా తల్లి అత్యంత బలం. ఆమె ఇక లేరనే విషయం గుండెను పిండేస్తున్నది. నా తల్లి శ్రీమతి అరుణ భాటియా ప్రశాంతంగా ఈ లోకం నుంచి నిష్రమించారు. పరలోకంలో ఉన్న నా తండ్రిని చేరుకొనేందుకు వెళ్లారు. నా కుటుంబం అత్యంత విషాదంలో ఉన్న సమయంలో ఆమె కోసం మీ సంతాప సందేశాలను గౌరవిస్తాను. ఓం శాంతి అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. అక్షయ్ కుమార్‌కు సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.