బాలయ్య ఫై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం

నందమూరి బాలకృష్ణ ఫై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి మూవీ సంక్రాంతి బరిలో వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మొదటి వారం పూర్తి అయ్యేలోపే ఈ సినిమా వసూళ్లు వంద కోట్లు దాటేశాయి. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటుంది. సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యిన నేపథ్యంలో మేకర్స్ సోమవారం చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించారు.

ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా గురించి చెపుతూ మా మధ్య రకరకాల విషయాలు చర్చకు వస్తాయి. నాన్న గారు, ఆ డైలాగులు, రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కినేని అంతా కూడా..అంటూ బాలయ్య సడెన్‌గా ఏదో మాట్లాడేశారు. పాత సినిమాలకు సంబంధించిన చాలా విషయాలు చర్చించుకున్నామని చెప్పే క్రమంలో అక్కినేని పేరెత్తిన బాలయ్య దాంతో పాటు ‘తొక్కినేని’ అనే మాట వాడటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అదీగాక నిన్న అక్కినేని నాగేశ్వర్ రావు వర్ధంతి. దీంతో మరింత వైరల్ గా మారింది. బాలయ్య కామెంట్స్ ఫై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య ఉద్దేశపూర్వకంగా అలా అనలేదని.. ఆయన ఫ్యాన్స్ వివరణిస్తున్నారు. ఫ్లోలో మాట్లాడేటప్పుడు.. అలా వచ్చిందని, అంతేకానీ.. నాగేశ్వరరావు గారి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడలేదని పోస్టులు పెడుతున్నారు.