‘అదే నేను అంటే.. శాసనం.. దైవ శాసనం’

YouTube video

మరోసారి బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. పంచ్ పవర్ డైలాగ్స్ తో రోమాలు నిక్క పొడిచేల చేసాడు. బాలయ్య – బోయపాటి కలిస్తే డైలాగ్స్ కు కొదవలేదని మరోసారి అఖండ తో రుజువు కాబోతుందని తాజాగా విడుదలైన ట్రైలర్ చెప్పకనే చెపుతుంది.

బాలయ్య , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ తర్వాత రాబోతున్న మూడవ సినిమాగా రాబోతున్న అఖండ ఫై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే చిత్రం తాలూకా ప్రమోషన్స్ తో క్రేజ్ తెచ్చిన చిత్ర యూనిట్..తాజాగా ట్రైలర్ విడుదల చేసి సినిమా ఫై అంచనాలు తారాస్థాయికి తీసుకొచ్చింది.

ముఖ్యంగా బాలయ్య నుండి వచ్చిన ప్రతి డైలాగ్స్ థియేటర్స్ లలో ఈలలు వేయడం ఖాయంగా కనిపిస్తున్నాయి. ” అతడికి ఎదురొస్తే బుల్డోజర్ వచ్చి గుద్దినట్టే అనడానికి అతడి గెటప్ లు బిగ్ ప్రూఫ్’, ‘విధికి విధాతకి విశ్వాసానికి సవాళ్లు విసరకూడదు’, అంచనా వేయడానికి పోలవరం డ్యామా పట్టి సీమ తూమా .. పిల్ల కాలువ`, " .ఒక మాట నువ్వు అంటే అది శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. దైవ శాసనం.... `ఒకసారి డిసైడై బరిలో దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్ ని.. తొక్కి పారదొబ్బతా లెఫ్టా రైటా టాపా బాటమా.. కొడకా ఇంచు బాడీ దొరకదు.. "నీకు సమస్య వస్తే దండం పెడతారు. మేము ఆ సమస్యకే పిండం పెడతాం.. బోత్ ఆర్ సేమ్..” ఇలాంటి భారీ డైలాగ్స్ సినిమాలో కొదవలేదు అన్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

మొత్తానికి అఖండ ట్రైలర్ మసాలా కంటెంట్ తో రక్తి కట్టిస్తోంది. బాలయ్య అభిమానుల్లో అమాంతం అంచనాలు పెంచే ట్రైలర్ ఇది. ఇక ఈ సినిమా రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ద్వార‌క క్రియేష‌న్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు