జై బాలయ్య అంటున్న చిత్రసీమ

జై బాలయ్య అంటున్న చిత్రసీమ

బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెల్లవారు జామునుండే హైదరాబాద్ లో ప్రీమియర్ షోస్ మొదలవ్వడం తో అర్ధరాత్రి నుండే అభిమానుల హంగామా నగరంలో మొదలైంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ థియేటర్‌లో బెనిఫిట్ షో వేయగా..ఈ సినిమాను వీక్షించేందుకు తారకరత్న, నిర్మాత దిల్‌రాజు, మిర్యాల రవీంద్ర వచ్చారు. అభిమానుల మధ్య సినిమా చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేసారు.

మరోపక్క సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వస్తుండడం తో చిత్ర యూనిట్ , అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాలకృష్ణ కు ఎలాంటి కథ అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందో బోయపాటి మరోసారి అది చేసి ఆకట్టుకున్నారని , బాలయ్య శివుడు , మురళీకృష్ణ గా రెండు రోల్స్ లలో అదరగొట్టాడని , ముఖ్యంగా శివుడు పాత్రలో అదరగొట్టాడని చెపుతున్నారు. విలన్ రోల్ లో శ్రీకాంత్ ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఓవరాల్ గా బాలయ్య మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చాడని చెపుతున్నారు. ఇక చిత్ర సీమా సైతం కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన అఖండ పెద్ద విజయం సాధించిందని చెపుతూ జై బాలయ్య అంటున్నారు.