సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అఖండ’

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో అఖండ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.గతంలో వీరిద్దరి కలయికలో సింహ , లెజెండ్ చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం తో అఖండ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాను బోయపాటి తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సెన్సార్ కార్య క్రమాలు పూర్తీ చేసింది.

సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీచేశారు. ఈ సినిమా రెండు గంటల 47 నిమిషాల నిడివితో విడుదల కానుందని సమాచారం. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గా ఈ నెల 27 న కానీ 28 న కానీ భారీ ఎత్తున వైజాగ్ లో జరపాలని ప్లాన్ చేసారు. కానీ ప్రస్తుతం ఏపీ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాక వర్షాలకు భారీ ఎత్తున ఆస్థి , ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం బాగోదని వేదికను మార్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.